SRCL: వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రాజన్న ఆలయంలో నిర్మాణంలో ఉన్న (Raft Foundation) పనులను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరిశీలించారు. జరుగుతున్న పనుల నాణ్యత, పురోగతిపై అధికారులతో చర్చించారు. నిర్దేశిత గడువులోపు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.