హనుమకొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ వాది కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినివ్వాలని సంఘం నాయకులు ఎంపీ కడియం కావ్యకు నేడు వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టుగా ఉండిన బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను బీసీ సంఘాల నాయకులు వివరించారు.