KMM: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఝార్ఖండ్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. దీపావళి పండుగ వేళ టపాసులు కాల్చేటప్పుడు చిన్నారులు పట్ల తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం మరోసారి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.