NLD: ఆంధ్ర ప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్ట్, రీ సర్వే కార్యక్రమంలో వచ్చిన భూ సమస్యల పరిష్కారం కోసమే గ్రామ సభ నిర్వహిస్తున్నట్లు బండి ఆత్మకూరు తహశీల్దార్ ఆల్ ఫ్రెడ్ తెలిపారు. బండి ఆత్మకూరు మండలం పెద్ద దేవలాపురం గ్రామంలో శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఎవరికైనా భూ సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తిచేశారు.