KRNL: ఎమ్మిగనూరు పట్టణంలోని గాంధీనగర్లో మూడు రోజులుగా అనారోగ్యంతో నీరసంతో పైకి లేవలేక బాధపడుతున్న ఎద్దుకు గోవా సేవా సమితి సభ్యులు, అహల్యాబాయ్ హోల్కర్ సేవా సమితి (AHLHS) సభ్యులు చికిత్స అందించి సేవా దాతృత్వాన్ని చాటుకున్నారు. వారు మాట్లాడుతూ.. ఎద్దు అనారోగ్యం గురించి స్థానికుల సమాచారంతో డాక్టర్ను తీసుకెళ్లి వైద్యం చేయించామని తెలిపారు.