తూ.గో: అనపర్తి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో అంగన్వాడీ కార్యకర్తల పోస్టులను భర్తీ చేసి, నూతనంగా నియమితులైన అంగన్వాడీ కార్యకర్తలకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాలింతలకు, గర్భిణులకు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో అంగన్వాడీలను ప్రభుత్వం నిర్వహిస్తుందని అన్నారు.