TG: హైదరాబాద్‌లో హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ముఠాను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేసి బాలానగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితులను సుమన్, లాలు, విజయ్ కుమార్‌లుగా పోలీసులు గుర్తించారు. వీరి నుంచి 2.6 లీటర్ల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఆయిల్ విలువ రూ.13.50 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నిందితులపై గతంలో ఎన్డీపీఎస్ కింద పలు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.