SDPT: హుస్నాబాద్ డివిజన్ పోలీస్ అధికారులతో కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ సమీక్షా సమావేశం నిర్వహించారు. గంజాయి ఇతర మత్తుపదార్థాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని, మహిళల, పిల్లల రక్షణకు పెద్దపీట వేయాలన్నారు. ఇన్ఫర్మేషన్ వ్యవస్థను మెరుగుపరచుకోవాలని, నీతి నిజాయితీగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలన్నారు.