రాహుల్ గాంధీకి హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ స్థానిక మాథురామ్ జిలేబీ గురించి మాట్లాడారు. దీన్ని దేశవ్యాప్తంగా అమ్మాలని వ్యాఖ్యానించారు. తాజాగా మాథురామ్ జిలేబీని సందర్శించిన సీఎం నాయబ్ అక్కడ మాట్లాడుతూ హర్యానా ప్రజలకు స్థానిక మాథు రామ్ ‘జిలేబీ’నే ఇష్టమని, ఫ్యాక్టరీలో తయారయ్యేది కాదని రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ విమర్శించారు.