జమ్మూకశ్మీర్‌లోని బుద్గామ్‌లోని మజమా గ్రామంలో ఉగ్రవాదులు ఇద్దరు యువకుల్ని కాల్చిచంపారు. స్థానికులు గాయపడిన సంజయ్, ఉస్మాన్ని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ ఇరువురు మరణించినట్లు తెలుస్తుంది. వారిద్దరూ యూపీ వాసులుగా అధికారులు గుర్తించారు. వీరు ఆ ప్రాంతంలోని జల్ జీవన్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులని తెలిపారు. గత 12 రోజుల్లో సామాన్యులపై దాడి జరగడం ఇది రెండోసారి.