TG: సివిల్ సర్వీస్ వ్యవస్థను సరళీకృతం చేస్తామని భారత ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా వెల్లడించారు. రాష్ట్రంలో పర్యటించిన చోప్రా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. ధాన్యంకొనుగోలులో ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవస్థాగత మార్పులు స్పూర్తిదాయకమన్నారు. వ్యవస్థను మరింత మెరుగు పరిచడంలో కేంద్రం అండగా ఉంటుందని వెల్లడించారు. ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రోల్ మోడల్‌గా నిలుస్తోందన్నారు.