మహారాష్ట్రలో రాజకీయ వేడి రాజుకుంటుంది. ముంబాదేవి నుంచి బరిలోకి దిగుతున్న షైనాపై ముంబయి దక్షిణ ఎంపీ అర్వింద్ సావంత్ (శివసేన-యూబీటీ) అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. షైనా సరుకు అంటూ తనపై అభ్యంతరకరంగా మాట్లాడారు. దీంతో షైనా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ‘నేను సరకు కాదు.. ముంబయి బిడ్డను’ అంటూ ఎక్స్ వేదికగా షైనా పోస్టు చేశారు.