సంగారెడ్డి: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా నవంబర్ 1 నుంచి 30 వరకు 30, 30(ఎ) పోలీస్ యాక్ట్-1861 అమలులో ఉంటుందని ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేనిది ప్రజలు, ప్రజా ప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించరాదని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టకూడదన్నారు.