AP: కూటమి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు వెల్లడించారు. శ్రీకాకుళం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సీఎం భేటీ అయ్యారు. అద్భుత గెలుపు అందించిన కార్యకర్తలకు న్యాయం చేస్తామని చంద్రబాబు తెలిపారు. పార్టీ జెండా మోసిన వారికి ఎప్పుడూ అన్యాయం జరగదని, క్షేత్రస్థాయిలో జనసేన, బీజేపీతో కలిసి పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో రామ్మోహన్, అచ్చెన్నాయుడు, కలిశెట్టి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.