అన్నమయ్య: ఈ నెల 3న జిల్లా ఇంఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై సమగ్ర నివేదికలు రూపొందించాలన్నారు.