AP: పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేయబోతున్నారని ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. పోలవరాన్ని కేవలం బ్యారేజీగా చేసేందుకు ప్రయత్నం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. పోలవరం కోసం కేంద్రం ఇచ్చిన రూ.2,348 కోట్ల నిధులు ఏం చేశారో కూటమి నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం కుంటుపడానికి సీఎం చంద్రబాబు చేసిన తప్పిదమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.