KRNL: పేద ప్రజల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కర్నూలు ఎంపీ నాగరాజు అన్నారు. కర్నూలు రూరల్ మండలం పంచలింగాలలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులు అందజేశారు. పింఛన్ డబ్బులను పెంచి అందిస్తుండటంతో లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారని తెలిపారు.