W.G: ఈ నెల 4వ తేదీన నిర్వహించే గోదావరి మాతకు మహా నీరాజనం హారతి కార్యక్రమంపై కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో సమీక్ష సమావేశం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం గోదావరి హారతి ఆహ్వాన పత్రికలను ఆయన అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.