AP: రాష్ట్ర ప్రజలకు 3 సిలిండర్లు ఇస్తామని మేనిఫెస్టోలో మాట ఇచ్చామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. దీపం-2 పథకానికి ఐదేళ్లలో రూ.13,400 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. జగన్ కంటే సంక్షేమం బాగా చేస్తామని చెప్పామన్నారు. జగన్కు దోచుకోవడం తప్ప ఇచ్చే మనసు లేదని విమర్శించారు. జనసేన కార్యకర్తలు రోడ్లపైకి వచ్చాకే ఏపీలో ప్రజలకు ధైర్యం వచ్చిందని పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వమని.. నటన ప్రభుత్వం కాదన్నారు.