NZB: సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణకై ప్రభుత్వం ఈ నెల 6 నుంచి జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పక్కాగా నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. బోధన్‌లోని రాకాసిపేట్తో పాటు లంగ్డాపూర్ గ్రామంలో అధికారులు, సిబ్బంది ఇళ్ల జాబితా రూపకల్పన కోసం చేపడుతున్న చర్యలను ఆయన పరిశీలించారు.