బాలీవుడ్ నటి నోరా ఫతేహి తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మొదట్లో ఇంటి అద్దె కట్టడానికి, తినడానికి కూడా డబ్బుల్లేక ఇబ్బంది పడ్డానని తెలిపింది. ‘దిల్బర్’, ‘కమరియా’ వంటి పాటలతో తనకు మంచి గుర్తింపు వచ్చిందని తెలిపింది. కెరీర్ను దృష్టిలో ఉంచుకుని ఆ రెండు పాటలకు ఎలాంటి పారితోషికం తీసుకోలేదని వెల్లడించింది.