W.G: పాలకొల్లు మండలం ఏలూరు కాపవరం, వాలమర్రు, అర్థకట్ల, కొమ్ము గ్రామాల్లో పల్లె పండుగ కార్యక్రమంలో శుక్రవారం రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ఆయన నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.