W.G: దీపం-2 పథకంలో భాగంగా ఆచంట ఎంపీడీవో కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమానికి ఆశించిన స్థాయిలో లబ్ధిదారులు హాజరు కాకపోవడం పై ఆచంట ఎమ్మెల్యే పితాని అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులకు..స్థానిక ప్రజా ప్రతినిధులకు ఎమ్మెల్యే సున్నితంగా చురకలు అంటించారు. త్వరలోనే వారందరు వివరణ ఇవ్వాలని కోరారు.