కృష్ణా: సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ను రూ. 4వేలుకు పెంచి ఇస్తున్నామన్నారు. ఆడ బిడ్డలకు ఇచ్చిన హామీ మేరకు ఉచిత గ్యాస్ సిలెండర్ల పంపిణీని నేటి నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.