ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వై.వీ.ఎస్ చౌదరి తెరకెక్కించిన ‘దేవదాసు’ సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఇలియానా.. పోకిరి, రాకీ, కిక్ వంటి హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ముంబయిలో పుట్టిన ఈమె.. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో సినిమాలు చేశారు. మైఖేల్ డోలన్ అనే వ్యక్తిని 2023లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. ఇవాళ ఇలియానా తన 38వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.