ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ తొలిరోజు లంచ్ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. 15 పరుగుల వద్ద కాన్వే (4) వికెట్ కోల్పోయింది. లాథమ్ (28), రచిన్ రవీంద్ర (5) కూడా స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. సుందర్‌కు 2 వికెట్లు పడ్డాయి. క్రీజులో యంగ్ (38), మిచెల్ (11) ఉన్నారు.