కృష్ణా: ఈ నెల 8 నుంచి 15వ తేదీ వరకు అధిక ధరలు, విద్యుత్ చార్జీల పెంపు, మహిళలపై అఘాయిత్యాలను నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ప్రజాపోరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు చెప్పారు. శుక్రవారం తిరువూరు సీపీఎం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నవంబర్ 15న కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా జరుపుతామన్నారు.