VZM: విశాఖ డైరీ పరిధిలో ఉన్న పాల రైతుల సమస్యలపై శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి శుక్రవారం వివిధ కార్మిక సంఘాలకు చెందిన నాయకులు వినతిపత్రం అందించారు. పాల రైతుల సమస్యలను పరిష్కరించాలని పాల రైతుల సంఘ జిల్లా కార్యదర్శి గొంప కృష్ణమూర్తి, సహాయ కార్యదర్శి మద్దెల రమణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గాడి అప్పారావు వినతి పత్రం అందించారు.