దేశవ్యాప్తంగా దీపావళి పండుగ సంబరాల్లో ఉన్న సామాన్యులకు చమురు కంపెనీలు షాకిచ్చాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచాయి. చమురు కంపెనీలు తాజాగా విడుదల చేసిన ధరల ప్రకారం ఈ గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ. 62 పెరిగి రూ.1802కు చేరుకుంది. అయితే 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.