W.G: మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ పంచాయితీ సెంటర్ నుంచి కుమ్మరపురుగుపాలెం వరకు ఇటీవల సిమెంట్ రోడ్డు నిర్మించారు. అయితే జలదుర్గమ్మ గుడి కాలువ కల్వర్టు వద్ద రోడ్డు నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పేరుపాలెం బీచ్‌కి నిత్యం వందలాది మంది పర్యాటకులు ఈ రోడ్డు ద్వారానే వెళ్తారు.