IPL-2025లో లక్నో కేఎల్ రాహుల్‌ను వదులుకుంది. అయితే గెలవాలన్న లక్ష్యంతో ఉన్నవారినే తాము ఎంపిక చేసినట్లు ఆ జట్టు యజమాని గొయెంకా అన్నారు. స్వార్థంగా ఆడేవారిని కాకుండా జట్టు కోసం శ్రమించే వారికి ప్రాధాన్యమిచ్చామన్నారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. రాహుల్‌ను దృష్టిలో ఉంచుకునే ఈ వ్యాఖ్యలు చేశారని మండిపడుతున్నారు. KL రాహుల్ నిస్వార్థపరుడని.. జట్టు కోసం ఆడే ఆటగాడు అని మరో నెటిజన్ అన్నాడు. దీనిపై మీ కామెంట్..?