AP: రాజమండ్రి విమానాశ్రయం వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను వెన్నెల తల్లిదండ్రులు కలిశారు. ఆలమూరులో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పదోతరగతి విద్యార్థిని వెన్నెల ఆత్మహత్యకు పాఠశాల యాజమాన్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ పవన్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. అయితే మధ్యాహ్నం వచ్చి మాట్లాడతానని వారికి సావధానంగా పవన్ సమాధానం ఇచ్చారు.