ALR: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం హెచ్చరించారు. శుక్రవారం ఉదయం ఆయన తన క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నూతనంగా నిర్మిస్తున్న పీఎం జన్ మన్ గృహాల గురించి అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వారందరికీ గృహాలు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.