KMR: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఈనెల 28న కామారెడ్డికి వస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ నాయకుడు సిద్ధిరాములు తెలిపారు. ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ మాదిగల ధర్మ యుద్ధ మహాసభను నిర్వహించనున్నారు. జిల్లాలోని ఎమ్మార్పీఎస్ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి మహాసభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.