తెల్లవారుజాము నుంచి ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు ఇజ్రాయెల్ చేస్తోంది. ఈ దాడులపై ఇరాన్ స్పందించింది. ఇలామ్, ఖుజెస్థాన్, టెహ్రాన్‌లోని సైనిక స్థావరాలను ఐడీఎఫ్ లక్ష్యంగా దాడులు జరిపిందని ఇరాన్ తెలిపింది. అయితే.. ఈ దాడుల కారణంగా పరిమిత స్థాయిలో నష్టం వాటిల్లినట్లు వెల్లడించింది.