HNK: వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని గురువారం ఉదయం 10 గంటలకు న్యూ శాయంపేట జంక్షన్లోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద నిర్వహిస్తున్నట్లు హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ప్రకటనలో తెలిపారు. కావున ప్రజాప్రతినిధులు, అధికారులు, కులసంఘాల నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి నివాళులర్పించాలని కోరారు. కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు.