MHBD: గూడూరు మండలం మర్రిమిట్ట గ్రామానికి చెందిన గుంటక వినయ్ ఇటీవల మృతిచెందాడు. ఆ కుటుంబానికి శనివారం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ రూ.1.60 లక్షల చెక్కును ఆర్థికసాయంగా అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన కుటుంబ భరోసా స్కీం పథకంతో చెక్కును అందించినట్లు తెలిపారు.