SRCL: వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో డాక్టర్ కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి హాజరై, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.