WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర నిన్నటి లాగే ఈ రోజు తటస్థంగా ఉంది. బుధవారం రూ.7,500 పలికిన క్వింటా పత్తి ధర ఈ రోజు సైతం అదే ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు. అలాగే నేడు మార్కెట్కు కొత్త పత్తి తరలిరాగా ధర సైతం నిన్న, మొన్నటితో పోలిస్తే కొంత తగ్గింది. నేడు కొత్త పత్తి క్వింటాకు రూ.7,070 పలికినట్లు అధికారులు పేర్కొన్నారు.