HYD: సికింద్రాబాద్, రంగారెడ్డి ఆర్టీసీ రీజియన్ల పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో గతంలో 11 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించేవారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత ఆ సంఖ్య సుమారు 22 లక్షలకు చేరుకుందని అధికారులు తెలియజేశారు. దీన్నిబట్టి గమనిస్తే మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అయినట్లుగా తెలుస్తోంది.