SRPT: కోదాడ పట్టణంలోని ఎక్సైజ్ పోలీస్స్టేషన్లో శుక్రవారం ఎన్నికల సమయంలో సీజ్ చేసిన 25 కేసుల మద్యాన్ని ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు పోలీసులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ రాము మాట్లాడుతూ.. నిబంధనల మేరకు మద్యం సీసాలను ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ శంకర్, స్థానిక ఎస్సైలు, కానిస్టేబుళ్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.