MHBD: స్వాతంత్ర సమరయోధుడు, తొలి, మలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలక భూమిక పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారు అలుపెరగని కృషి చేశారన్నారు.