HYD: విద్యుత్ మరమ్మతుల కారణంగా మంగళవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిజాంపేట రామభద్ర ఎన్ క్లేవ్, శ్రీరామ్ స్కూల్, ఎన్నారై కాలేజీ, గోకరాజు కళాశాల రోడ్డు చౌరస్తా పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. కావున వినియోగదారులు గమనించి సిబ్బందికి సహకరించాలని కోరారు.