VKB: పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి గండీడ్ మండలానికి నేడు రానున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి తెలిపారు. గండీడ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, గండీడ్, పెద్దవార్వాల్, చిన్న వార్వాల్ గ్రామాలలో సబ్సిడీ గ్యాస్ ప్రొసీడింగ్స్ అందజేయనున్నట్లు తెలిపారు.