NLG: డ్రగ్స్, గంజాయికి బానిస కాకుండా ప్రజలు సన్మార్గంలో నడవాలని మోత్కూర్ ఏఎస్ఐ వెంకన్న అన్నారు. శుక్రవారం స్థానిక బాబు శ్రీకాంత్ చారి చౌరస్తా వద్ద రాచకొండ పోలీస్ కమిషన్ ఆదేశాల మేరకు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్ నుంచి నకిలీ ఓటీపీలు వస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.