NZB: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిధుల అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజాపంతా జిల్లా నాయకుడు సుధాకర్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏసీపీకి వినతి పత్రం అందజేశారు. నిధుల అవకతవకలపై విచారణ చేపట్టి అందుకు సంబంధించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏసీపీ సానుకూలంగా స్పందించారని తెలిపారు.