NRML: బాసర ఆలయం వద్ద గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం లభ్యమైనట్లు సోమవారం ఎస్ఐ గణేష్ తెలిపారు. వృద్ధురాలి వయస్సు సుమారు (70)సంవత్సరాలు ఉంటుందని, పసుపు పచ్చ చీర, ఎర్రని జాకెట్ ధరించి ఉందని తెలిపారు. ఎలాంటి ఆధారాలు లభించకపోగా కేసు నమోదు చేసి, మృత దేహాన్ని భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే పోలీసులకు సంప్రదించాలని కోరారు.