HYD: ఖైరతాబాద్ మండలం సోమాజిగూడలోని ఎంఎస్ మఖ్రా ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కమ్యూనిటీ హాల్‌ను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం సందర్శించారు. అన్ని విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ విజయ రెడ్డి, అధికారులతో మాట్లాడి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.