NLG: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం నార్కట్ పల్లి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి ఆధ్వర్యంలో రైతుధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షరతులు లేకుండా హామీలు, కొర్రీలు లేకుండా రుణమాఫీ చేయాలని, రైతన్నలపై చిన్నచూపు తగదని ఆయన మండిపడ్డారు.