ఆసిఫాబాద్: జిల్లాలో ఇంటర్మీడియెట్ ప్రవేశాల గడువును రూ. 500 అపరాధ రుసుంతో ఈ నెల 30 వరకు పెంచినట్లు డీఐఈవో కళ్యాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఇంటర్ బోర్డు పలుమార్లు గడువు పొడిగించిందని, ఇది చివరి అవకాశం అవుతుందని స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.